తిరుమల : తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పీసీ రాయల్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు (Annaprasadam Trust ) రూ.10 లక్షలు విరాళంగా ( Donations ) అందించారు. బెంగుళూరుకు చెందిన సుకుమార్ అనే మరో భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 25 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 68,838 మంది భక్తులు దర్శించుకోగా 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.49 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.