Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలు, దశల వారీగా అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర సమీక్షించనున్నారు. శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, క్షేత్ర అభివృద్ధి కోసం అటవీ శాఖ అభ్యంతరాలు తదితర అంశాలు, విస్తరణపై చర్చించనున్నారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
శ్రీశైలం అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌లో రహదారులు, వసతి గృహాలు, పార్కింగ్, భక్తుల సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖ అనుమతులపై సమగ్ర సమీక్షించనున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో భవిష్యత్తులో శ్రీశైల క్షేత్ర మాస్టర్ ప్లాన్‌పై దృష్టి సారించారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన సమగ్ర సమాచార నివేదికను సమర్పించాలని అధికారులు యోచిస్తున్నారు.