అమరావతి : ఏపీలోని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టులో (Gannavaram airport) బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు (Dense fog ) కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు (Bangalore) , విశాఖ (Visaka) , ఢిల్లీ నుంచి వచ్చే విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి.
విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగడంతో రెండురోజులుగా పొగమంచు వాతావరణాన్ని కమ్మేస్తోంది.