వాయుగుండంగా మాండూస్.. రాయలసీమ, తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్
Cyclone Mandous | మాండూస్ తుఫాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
అమరావతి: మాండూస్ తుఫాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. తెలంగాణలో పలుచోట్ల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కాగా, తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమశిల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. దీంతో పెన్నా నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, చాపారు, రాజుపాలెం, ఖాజీపేట, పెద్దముడియం మండలాల్లో వర్షం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో 250 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 149 స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 388 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
తిరుపతి జిల్లాలో 3 వేల ఎకరాల్లో పంట నష్టం, 150 ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 360 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తిరుపతితోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయింది. దీంతో వెంకటగిరి, రావూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

