Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే అర్నబ్ తుపాను (Cyclone Arnab) ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై, ముఖ్యంగా విశాఖపట్నం (Vyzag) పై స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది.
Cyclone Arnab : తీరాన్ని తాకకముందే అర్నబ్ తుపాను (Cyclone Arnab) ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై, ముఖ్యంగా విశాఖపట్నం (Vyzag) పై స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. గాలి తీవ్రతకు మహారాణిపేట (Maharanipet) అంగడిదిబ్బ వద్ద ఓ చెట్టు విరిగి పాన్‌షాపుపై పడటంతో ధ్వంసమైంది.
అదేవిధంగా రామ్‌నగర్ సేవాసదన్ స్కూల్ సమీపంలో మరో చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు విశాఖలోని ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌లను పూర్తిగా మూసివేశారు. పర్యాటకులు, స్థానికులు సముద్ర తీరానికి రావద్దని తీవ్రంగా హెచ్చరించారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస, పొందూరు సహా మొత్తం 12 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దాదాపు 4.65 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరిపంట కోతకు సిద్ధంగా ఉండగా ఈదురుగాలులతో పంట నేలవాలుతోంది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విజయనగరం జిల్లాలోనూ పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీచేశారు. తుపానువల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. తీరప్రాంత, లోతట్టు గ్రామాల్లోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మూడు జిల్లాల్లో 24 గంటలపాటు కంట్రోల్ రూమ్‌లు పనిచేయాలని, సహాయక కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, తుపాను బలహీనపడిన తర్వాత గ్రామస్థాయిలో ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ‘అర్ణబ్’ అతి తీవ్ర తుపానుగా మారి అక్టోబర్ 28న మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికే బాపట్ల జిల్లాలోని చీరాల, ఓడరేవు, రామాపురం బీచ్‌లను మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించి, తమ పడవలను నిజాంపట్నం హార్బర్ జెట్టీ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాకినాడ జిల్లాలో 101 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ సంబంధిత సమస్యల కోసం 1912 టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఏపీఈపీడీసీఎల్ సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

