తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్లో మాత్రమే వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,301 మంది భక్తులు దర్శించుకోగా 20,222 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.32 ఆదాయం వచ్చిందన్నారు.
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Tiruchanur Brahmotsavam ) వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు బుధవారం అమ్మవారు గోవర్ధనగిరిధారియైన (Govardhanagiridhari) శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.