తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్లుమెంట్లు (Compartments) నిండిపోయి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 నుంచి 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63, 493 మంది భక్తులు దర్శించుకోగా 31,676 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ(Hundi) కి రూ. 4.69 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం రోజు రాత్రి ముగిసాయి. స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.