తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల నుంచి 30 గంటల వరకు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారని 67,873 మంది భక్తులు దర్శించుకోగా 33,532 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ కానుకలు రూ. 3.93 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.