తిరుమల : తిరుమల (Tirumala) లో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల (Salakatla Brahmotsavam) సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. గోవిందానామస్మరణతో వీధులు మారుమ్రోగుతున్నాయి.
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని 9 Lord Venkateswara Swamy) దర్శించుకునేందుకు భక్తులతో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి కృష్ణాతేజ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 86,859 మంది దర్శించుకోగా 37,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల ద్వారా హుండీకి రూ. 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.