తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకట్వేరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఏటీసీ గెస్ట్‌హౌస్ వరకు క్యూలైన్లో నిలబడియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshan) అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.02 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నిన్న స్వామివారిని 84,066 మంది భక్తులు దర్శించుకోగా 29,044 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.