అమరావతి : అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేసి వారి మన్ననలు పొందిన విశాఖ వాసి ఈశ్వర్ (Iswar) మరణం పట్ల ప్రముఖ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలిపారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఈశ్వర్ గురువారం గుండెపోటు (Heart Attack) తో మరణించారు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు.
ప్రసుత్తం ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సైడ్ ఆర్మ్త్రో బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. ఆయన మృతిదేహానికి భారత క్రికెటర్ శ్రీకర్ భరత్ నివాళి అర్పించారు. పలువురు ప్రముఖ క్రికెటర్లు సెహ్వగ్, సచిన్ (Sachin), గంగూలీ, కోహ్లీ (Kohili) , పాంటింగ్, డేవిడ్, వార్నర్, దినేష్ కార్తీక్ వంటి ప్రముఖులు ట్విటర్ వేదికగా ద్వారా సంతాపం తెలిపారు.