MLC | పార్టీ ఫిరాయింపు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు ఇటీవల పార్టీమారిన విషయం తెలిసిందే. వంశీ కృష్ణ జనసేనలోకి వెళ్లగా, రామచంద్రయ్య సైకిలెక్కారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన మండలి చైర్మన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. వారికి నోటీసులు జారీచేశారు. వారినుంచి వివరణ కూడా తీసుకున్నారు. సమగ్ర విచారణ తర్వాతే ఇద్దరిపై వేటు వేసినట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీలు ఇద్దరు తమ పదవులను కోల్పోయారు.
ఇటీవల ఎనిమిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. వారిలో వైసీపీ నుంచి టీడీపీకి, తెలుగుదేశం నుంచి అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి (వైసీపీ), కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాళి గిరి (టీడీపీ)పై వేటు పడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

