తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 69,587 మంది భక్తులు దర్శించుకోగా 28,645 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.