అమరావతి : ఏపీలోని నెల్లూరు( Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Lorry accident ) జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై చేపల లోడ్లో వెళ్తున్న కంటైనర్ లారీ ముందుగా మినీ వ్యానును, మరో మూడు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టి రోడ్డు పక్కన దుకాణంలోకి దూసుకెళ్లింది .
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.