అమరావతి : నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల ( Police )పై కత్తితో దాడి (Accused Attack) చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌నగర్ కూడలిలో మద్యం మత్తులో ఉన్న దేవరకొండ అజయ్ అనే వ్యక్తి రాజా అనే యువకుడిని కత్తితో పొడిచాడు.
నిందితుడు జాడ తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఆటోలో వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు ఆటో డ్రైవర్ బాబాపై, సీఐ శ్రీకాంత్ ( CI Srikanth ) పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో సీఐ నింతుడు అజయ్ మోకాలిపై కాల్పులు జరపడంతో అతడు గాయపడ్డాడు. గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించారు. యువకుడు రాజా, డ్రైవర్ బాబాలరు ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలైటర్‌పై చికిత్స అందజేస్తున్నారు.