నంద్యాల జిల్లా మహానందిలో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన దంపతులు తమ చిన్నారిని కారులోనే వదిలేసి దర్శనానికి వెళ్లారు. దీంతో కారులో ఊపిరాడక చిన్నారి తీవ్ర ఇబ్బందులు పడింది.
కారులో లాక్ అయిపోయి శ్వాస రాక ఇబ్బంది పడుతున్న చిన్నారిని.. అక్కడే ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారు అద్దాలు పగులగొట్టి చిన్నారిని రక్షించాడు. కానిస్టేబుల్ అప్రమత్తమై చిన్నారిని రక్షించడం పట్ల స్థానికులు, భక్తులు ప్రశంసించారు.