అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం ఆనకట్ట వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ( Constable) గుండెపోటుతో మృతి చెందాడు. ఆనకట్ట వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరాస్వామి(52) గత కొన్నిరోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఉన్న తేనేటీగల ( Bee Attack ) గుంపు అతడిపై దాడి చేసింది.
ఈ క్రమంలో ఆయన తప్పించుకునే ప్రయత్నంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృత దేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.