అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో మహిళలకు రక్షణ లేదని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బిహార్( Bihar ) కంటే దారుణమైన పరిస్థితులున్నాయని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని ( Former Minister Vidadala Rajini ) ఆరోపించారు. ఇటీవల గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకులు మహిళను వివస్త్రకు గురిచేసి , దాడికి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా గాయపడ్డ బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం విడదల రజిని మాట్లాడుతూ ముందుగానే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించి మహిళపై దాడులు చేశారని ఆరోపించారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిణి సారించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.