అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళలు, యువతి, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ మహిళా నాయకులు జాతీయ మానవహక్కుల (National Human Rights ) సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు ( Chandrababu) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగాయని పేర్కొన్నారు. చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశాయాప్ను (Disha App) నిర్వీర్యం చేశారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలని కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతిని కోరారు. ఆమెను కలిసిన వారిలో వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ వరదు కళ్యాణి(MLC Varudu Kalyani) , ఎంపీ డాక్టర్ తనుజారాణి, మాజీ పార్లమెంటు సభ్యులు చింత అనురాధ, మాధవి తదితరులున్నారు.