అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Chandra Babu) అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై (MP Vijayasai Reddy) టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు (Police Complaint) చేశారు. టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న(Budda Venkanna) ఆధ్వర్యంలో విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గ్యాంగ్ రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి వేలాది కోట్లను సంపాదించుకునేందుకు కాకినాడు పోర్టును బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. పోర్టు బాధితుడు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా అంటూ ప్రశ్నించారు. 2019-24 వరకు వైసీపీ నాయకుల దారుణాలు కోకొల్లలని ఆరోపించారు.
కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఎంపీ విజయసాయి రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.