అమరావతి : అన్నమయ్య కీర్తనపై ప్రముఖ గాయని శ్రావణి భార్గవి చిత్రీకరించినా తీరును నిరసిస్తూ
తిరుపతి వాసులు కొందరు ఇవాళ తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు కూడా తప్పుగా చిత్రీకరించకుండా ఓ చట్టాన్ని టీటీడీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ చిత్రీకరణపై టీటీడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రావణి భార్గవి చిత్రీకరించిన సంకీర్తనను వెంటనే తొలగించాలని కోరారు. స్వామి వారిని కీర్తిస్తూ అన్నమయ్య భక్తితో ఆలపించిన సంకీర్తనలను వింటే భక్తి భావం పెరుగుతుందన్నారు. కానీ భార్గవి తనకోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరంగా ఉందన్నారు. అన్నమయ్య వంశస్థులతో ఆమె మాట్లాడిన తీరుకూడా గర్వంతో ఉందని, అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చేప్పాలని వారు డిమాండ్ చేశారు.