Cobra | ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం.. భయాందోళనలో రోగులు
Cobra | ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
అమరావతి : ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము (Cobra ) కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రి (Hospital) కి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు.
పాముకాటుతో విద్యార్థి మృతి
ఇదే జిల్లాలోని పొందూరు మండలంలో పాముకాటుతో లవకుమార్ (14) అనే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముండే దినసరి కూలీలు రావాడ చిన్నయ్య, నీలవేణిలకు రమ్య, లవ కుమార్ అనే ఇద్దరు పిల్లలున్నారు. తల్లి నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో ఆమె అక్కడే ఉంటుంది. కుటుంబ పోషణకు చిన్నయ్య ఇతర గ్రామానికి వెళ్లగా ఇంటిలో అక్క రమ్య, లవకుమార్ ఉంటున్నారు.
అయితే రాత్రి నేలపై పడుకున్న సమయంలో కట్ల పాము కాటు వేసింది. అనంతరం మెడకు చుట్టుకోవడంతో లేచి దాన్ని గుర్తించి నేలపై పడేసి కర్రతో కొట్టి చంపివేశాడు. పాము కాటు వల్ల అనారోగ్యానికి గురికావడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అక్క డ చికిత్స పొందుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

