విజయవాడ : (Jagan tour to Orissa) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఒడిశా రాష్ట్ర పర్యటకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఆయన సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమై పలు పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశాలపై ఇప్పటికే అధికారులు పూర్తి కసరత్తు చేసినట్లు సమాచారం.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో వైఎస్ జగన్ సోమవారం సమీక్ష జరిపారు. నవీన్ పట్నాయక్‌తో భేటీకి ముందు అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సీఎం జగన్ రేపు భువనేశ్వర్ వెళ్లనున్నారు. సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను నవీన్ పట్నాయక్‌కు జగన్ వివరించి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.
మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రాయం నుంచి సీఎం జగన్ ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అక్కడి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయల్దేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసానికి చేరుకుని చర్చలు జరుపుతారు. రాత్రి 7 గంటలకు ఒడిశా నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..