సీనియర్లే ఇలా చేస్తే ఎలా? కాకాణి, అనిల్‌పై ఏపీ సీఎం జగన్ అసహనం
నెల్లూరు పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. కొన్ని రోజులుగా మంత్రి కాకాణి,మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్…. వారిద్దర్నీ సీఎంవోకు పిలిపించారు. వారితో చర్చించారు. వారిద్దరికీ క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. సీనియర్లే ఇలా చేస్తే ఎలా? అంటూ సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఏంటని వారిద్దరిపై ఫైర్ అయ్యారు. కచ్చితంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, మీరిద్దరూ కలిసే పనిచేయాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
ఇన్ని రోజుల పాటు ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్న తర్వాత… మీడియాతో మంత్రి కాకాణి గోవర్ధన్ మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్‌కు, తనకు ఎలాంటి విభేదాలూ లేవని ప్రకటించారు. తామెక్కడా పోటాపోటీ సభలు నిర్వహించలేదని పేర్కొన్నారు. పోటా పోటీ సభలు కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. నిప్పు లేకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో పొగ వస్తోందంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులం మాత్రం కామని తెలిపారు. తనకు, మాజీ మంత్రి అనిల్‌కు ఎలాంటి గ్యాప్ లేదని, ఫ్లెక్సీలు కూడా చింపుకోలేదని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. ఇరువురమూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కాకాణి వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

