Kodali Nani | చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని కొడాలి నాని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను, జగన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవరిని టార్గెట్ చేసినా సరే భయపడేది లేదని స్పష్టం చేశారు.
తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రుషికొండలోని భవనాలను జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాక్లను వైఎస్ జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ జగన్కు లేదని.. వైజాగ్లో సొంతిల్లు కట్టుకుని షిఫ్ట్ అవుతారని తెలిపారు. ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని.. వైసీపీ నేతలకు జగన్ ధైర్యం చెప్పారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటామని, తమ అధినేత కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు.
#KodaliNani తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. గుడివాడ ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఆయనలో మార్పు కనిపించలేదు.
Some comments from today’s media interaction
– జగన్ మోహన్ రెడ్డి గారి ఎంట్రుక కూడా వీళ్లు ఏం పీకలేరు.
– ఋషికొండ పర్యాటక భావనాలని ఈ సిగ్గు ఎగ్గూ లేని వాళ్లు… pic.twitter.com/EnriM25elT
— Gulte (@GulteOfficial) June 20, 2024