రాజకీయాల్లోకి వస్తా.. మూడింట పోటీ చేస్తా: నిర్మాత నట్టి కుమార్
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా ఎన్నికల బరిలో

విజయవాడ: ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానంటున్నారాయన.
రాజకీయం ఆరంగేట్రంపై ఆయన చేసిన ప్రకటన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నది. జగన్ ఆదేశిస్తే అంటూ స్వయంగా ఆయనే తన రాజకీయ ఆరంగేట్రంను వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎదుర్కోవడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, కొంతమంది అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సినీ ఫీల్డ్ లోని కొందరు.. అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
ఇలాఉండగా, తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే ఆయన భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రజల మధ్యలో ఉంటానని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

