(CI Suicide) విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్ట్స్‌లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పుడే చెప్పలేమంటున్నారు స్థానిక పోలీసులు.
జిల్లా పోలీసు శాఖలో హోం గార్డ్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు క్వార్టర్స్‌లోని తన నివాసంలో సర్వీసు రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈశ్వర్రావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు ఇంకా తెలియరాలేదు. పై అధికారుల వేధింపులా? లేదా కుటుంబ సమస్యలా? అనేది తేలాల్సి ఉన్నది. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ దవఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.