Vande Bharat | ఏపీ వాసులకు గుడ్న్యూస్.. త్వరలోనే నరసాపురం రైల్వే స్టేషన్కు వందే భారత్ రైలు రానుంది. చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలే.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10 చేరుకుంటుంది. అయితే పొడిగించిన సర్వీసు11.45 గంటలకే విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 11.50 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గుడివాడ, మధ్యాహ్నం 1.30 గంటలకు భీమవరం , మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఇక నరసాపురం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి 3.20 గంటలకు భీమవరం, మధ్యాహ్నం 4.10 గంటలకు గుడివాడ, 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి 4.55 గంటలకు బయల్దేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలక చెన్నై సెంట్రల్ స్టేషన్కు చేరుకుంటుంది.