అమరావతి : అనంతపురం జిల్లాలో రథం దగ్ధం (Chariot burnt ) పై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జిల్లాలోని అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అగంతుకులు నిప్పుపెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు (Victims Arrest) చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు, అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి బయలు దేరి, గ్రామస్థులతో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.