అమరావతి : విమానాల్లో బాంబులు( Bomb Threat ) పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని , కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి(Union Minister ) రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) హెచ్చరించారు. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టంలో మార్పులు తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆయన విశాఖపట్నం(Visakapatnam) నుంచి విజయవాడ (Vijayawada) కొత్తగా రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చిన బాంబు బెదిరింపులపై ఇప్పటికే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులకు ఫ్లయింగ్ బ్యాన్ చేసేందుకు రానున్న రోజుల్లో చట్టం తీసుకువస్తున్నామన్నారు.
బాంబు బెదిరింపులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విమానయానశాఖ పరిధిలోని అందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయంలో సీరియస్గా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలోని ఎయిర్పోర్టులను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
విశాఖ నుంచి త్వరలోనే అంతర్జాతీయ కార్గో సర్వీసులు పునరుద్ధరిస్తామని, రాష్ట్రంలోని నగరాల మధ్య, దేశంలోని ఇతర నగరాలతోనూ కనెక్టివిటీని పెంచుతామని అన్నారు. 2025 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధమవుతుందని పేర్కొన్నారు.