అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు (Chandra Babu) లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ (IAS confirmation) ప్రక్రియ ఎన్నికల కోడ్ (Election Code) కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంవోలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు.
కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని అన్నారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చేవరకు కన్ఫర్మేషన్ను వాయిదా వేయాలని సూచించారు.
ఆమె కాలిఫోర్నియాలో తొలిమహిళా జడ్జి కావడం గర్వకారణం
కాలిఫోర్నియా(California) లో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ విజయవాడకు చెందినవారు కావడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. తన పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు.