అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్పష్టత ఇవ్వాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై(Steel Plant) కేంద్ర మంత్రులు చెప్తున్నది ఒకరకంగా క్షేతస్థాయిలో దానికి వ్యతిరేకంగా జరుగుతుందని విమర్శించారు. విశాఖలో మాజీ మంత్రి అమర్నాథ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
స్టీల్‌ప్లాంట్‌పై సీఎం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు విశాఖపై రాజకీయం చేయొద్దని సూచించారు. ప్లాంట్‌పై జరుగుతున్న తాజా పరిణామాలపై తన వైఖరిని వెల్లడించాలని కోరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ( Privatization ) ఒక్క నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదని, కూటమి ప్రభుత్వం ధర ఎందుకు తగ్గించిందో వివరించాలని కోరారు. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఇసుక పాలసీపై ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఉచిత ఇసుక ఎప్పుడు లభిస్తోందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు . చట్టం అందరికి సమానంగా అమలు చేయాల్సిన అవసరముందని సూచించారు.