అమరావతి : ప్రముఖ సినీనటుడు చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన నటుడని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు.