అమరావతి : బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబులో వణుకు మొదలైందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆరోపించారు. పశ్చిమగోదావరిలోని రాజమండ్రిలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం రాష్ట్రంలో చేపట్టే కొత్త కార్యక్రమాలను చూ సి తట్టుకోలేక వాటిని భగ్నం చేసేందుకు ఏదో ఒక నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
ఫేక్ వీడియోతో ప్రభుత్వంపై , వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు కుప్పంలో వైసీపీ దాడులకు పాల్పడిందని కొత్త డ్రామా ఆడుతున్నారడని అన్నారు. కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, అతని పతనం తప్పదని పేర్కొన్నారు.