అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu) తన అవసరాలకు తగ్గట్లు రంగులు మార్చడాన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( YS Jagan Mohanreddy ) విమర్శించారు.
వైసీపీ హయాంలో జరిగిన భూ సర్వే ( Bhu survey ) ను తన ఖాతాలో వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై గురువారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
గతంలో ఏ ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అవి తన హయాంలో ప్రారంభమయ్యాయని క్రెడిట్ చోరీకి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. 2017లో తాను చేపట్టిన పాదయాత్రలో రైతులు విన్నవించిన మేరకు భూముల రీసర్వేకు విషయం మెనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో భూ సర్వేను ప్రారంభించామని వెల్లడించారు.
ఎలాంటి వివాదాల్లేకుండా, అత్యంత పారదర్శకంగా భూముల రీ సర్వే జరిపి భూ రికార్డులు సిద్ధం చేసి, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు అందజేశామని వివరించారు. తమ హయాంలోనే డ్రోన్లతో భూ సర్వే జరిగిందని, సర్వే రాళ్లను ఉచితంగా రైతులకు అందించామని పేర్కొన్నారు.
గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల చేతుల్లో హత్యకు గురైన వైసీపీ కార్యకర్తల సాల్మన్ కేసులో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు దోషులేనని ఆరోపించారు.