అమరావతి: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను ఏపీ ప్రభుత్వం ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటుందని విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా ఆడకపోతే పవన్ కల్యాణ్‌కు ఎలాంటి నష్టం రాదని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సీపీఐ నారాయణ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతారని తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండే ఎంపీ సీట్లున్న సీపీఐ జాతీయ పార్టీ నా ప్రశ్నించారు. ఉక్రెయిన్‌లో చిక్కు్కున్న విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుడం విడ్డురంగా ఉందని అన్నారు. పొలిటికల్ మెగాస్టార్ వైఎస్ జగన్ అని కొడాలి నాని కొనియాడారు.