తిరుమల లడ్డూపై ( Tirumala laddu ) సీఎం చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. లడ్డూలో కల్తీ జరుగలేదని ల్యాబ్లు, సిట్ అధికారులు తేల్చిచెప్పాయని అన్నారు. చంద్రబాబు చేసిన పాపిష్టి ఆరోపణ అబద్ధమని ల్యాబ్ రిపోర్టులు తేల్చి చెప్పాయని పేర్కొన్నారు.
చంద్రబాబు ఎంత పాపం చేశాడో బయటపడుతోందని, కూటమి నేతలు ఎంత నికృష్టులో ప్రపంచానికి తెలుస్తోందని అన్నారు. తాము చేసిన పాపాలకు, తప్పులకు వెంటనే భక్తులకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోనే సంస్థే పేరు మార్చుకుని భోలేబాబాగా మారిందని వెల్లడించారు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకు అలవాటని, తన నిరాధారమైన వాఖ్యలతో వైసీపీ ప్రభుత్వానికి ఉన్న పేరును దెబ్బతీయడమే కాదని, కోట్లాది మంది ప్రజల మనోభావాలనూ దెబ్బతీశాడని దుయ్యబట్టారు.