అమరావతి : కేంద్రంలోని ఎన్డీయే(NDA) ప్రభుత్వం ఏపీలోని వృద్ధులకు తీపికబురును అందించింది. తోడులేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలను (Old Age Homes ) మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం వీటిని ఆయా చోట్ల నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 32 వృద్ధాశ్రమాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) 12 మంజూరు చేసింది. తిరుపతి ( Tirupati ) జిల్లాలో 4, వైఎస్సార్ జిల్లాలో 2, పార్వతీపురం, అనకాపల్లి (Anakapalli) , కాకినాడ, శ్రీసత్యసాయి, పల్నాడు (Palnadu) , మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు ఒక్కోటి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో ఆశ్రమానికి కేంద్రం 25 లక్షలు మంజూరు చేసింది.
ఆశ్రమంలో కనీసం 25 మంది ఉంటే కేంద్రం ప్రతి సంవత్సరం రూ.21 లక్షలు మంజూరు చేస్తుంది. వీటిని స్వచ్ఛంద సేవా సంస్థలు (Charitable Service Organizations) నిర్వహించనున్నాయి. కేంద్రం ఆర్థిక సాయంతో రాష్ట్రంలో 68 వృద్ధాశ్రమాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నం, చిత్తూరు మాత్రమే నడుస్తున్నాయి. వీటితో పాటు మరో వంద వరకు ప్రైవేట్ నిర్వహణలో పనిచేస్తున్నాయి.