అమరావతి : పోలీస్స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకాలు కలిగించారనే అభియోగంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) , మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు(Case register) చేశారు. ఈ మేరకు చిలకలపూడి పీఎస్లో కేసు మోదు చేశారు. ఇటీవల పేర్నినాని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మెడికల్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు.
ఈ విషయంలో మచిలీపట్నం ఆర్ఆర్ పేట పోలీసులు వైసీపీ నగర కమిటీ అధ్యక్షుడు మేక సుబ్బన్నను స్టేషన్కు పిలిపించుకుని అనుచితంగా మాట్లాడి బెదిరించారని స్టేషన్కు వెళ్లి సీఐ ఏసుబాబును పేర్నినాని నిలదీశారు. పోలీసు స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి హల్చల్ చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడంతో నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ హోంమంత్రి అనిత ఘటనపై మాట్లాడుతూ నాని స్టేషన్కు వెళ్లి పోలీసులను బెదిరించడం , పోలీసులను అవమానించేలా ప్రవర్తించాడని ఆరోపించారు. నానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పు చేసిన వారికి నోటీసులిస్తామని, కేసులు పెడతామని వెల్లడించారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పినా ఆ నాయకుల్లో మార్పు రావడం లేదని దుయ్యబట్టారు.