హైదరాబాద్ : నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు (Jana Sena MP ) లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్( Lingamaneni Sanjush ) పై పోలీసులు కేసు నమోదు ( Case register ) చేశారు.
ఈనెల 16న హైదరాబాద్ – ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖి(26) అనే యువతిని ఆస్టన్ మార్టిన్ కారు ఢీ కొట్టింది. దీంతో కారు కిందపడి యువతి మృతి చెందింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్గా గుర్తించారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.