దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌కు ఊరట లభించింది. 2011 లో ఆయన మహిళలపై దాడి చేశారంటూ చింతమనేనిపై ఓ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చింతమనేని శుక్రవారం ఏపీలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈయనపై నమోదైన నేరం రుజువు కాకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది. దీంతో ఈ కేసు నుంచి ఆయనకు ఊరట లభించింది.