అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానం( Liquor policy) రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ (Cabinet Sub Committee) ని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులు కొల్లురవీంద్ర(Kollu Ravindra), గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్(Nandendka Manohar), కొండపల్లి శ్రీనివాస్‌తో కూడిన సబ్‌కమిటీని నియమించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపై కమిటీ సమీక్షించనుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. వివిధ వర్గాల అభిప్రాయాలు సైతం సేకరించనుంది. ఇప్పటికే అధికారులు ఇచ్చిన నివేదికను సబ్‌కమిటీ పరిశీలించనుంది.
గత వైసీపీ పాలనలో జే బ్రాండ్ (J Brand) పేరిట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను జరిపిందని, కల్తీ మద్యంను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సభ్యులు విస్తృతంగా ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం నూతన మద్యం పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం మరోమారు మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్‌కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది విధానాన్ని ప్రకటించే అవకాశముంది.