Markapuram Tragedy | మార్కాపురం దుర్ఘటనలో బస్సు డ్రైవర్ అరెస్ట్.. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు
Markapuram Tragedy | ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం పట్టణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ( Markapuram ) జిల్లా రాయవరం పట్టణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ నడుపుతున్న హరికృష్ణా రెడ్డి ( Harikrishna Reddy ) యజమానిగా ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
బుధవారం లారీ ట్రక్క్ను బస్సు ఢీ కొన్న ఘటనలో మొత్తం 14 మంది సజీవదహనం కాగా మరో 12 మంది వరకు గాయాలతో ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. బస్సు ఘటన జరుగగానే అక్కడి నుంచి పారిపోయిన డ్రైవర్ హరికృష్ణారెడ్డిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రులు గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు.
బాధితులు పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రోడ్లు వెడల్పు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయని, వాహనాల వేగాన్ని నియంత్రించాలని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

