హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థా నం కొత్త పాలకమండలి కొలువుదీరింది. టీటీడీ 54వ ధర్మకర్త మండలి చైర్మన్గా బీఆర్ నాయుడు చైర్మన్గా, మరో 15 మంది సభ్యులుగా ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టారు. తిరుమల ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ స్వా మిని ముందుగా దర్శించుకున్న బీఆర్ నాయుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుం చి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి స్వాగతం పలకగా, ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు ఆయనచేత ప్రమాణం చేయించారు. చైర్మన్ దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా టీటీడీ ఈవో శ్యామల రావు స్వామి వారికి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు.
9న శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు : టీటీడీ
తిరుమలలో ఈ నెల 9న శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. శ్రవణా నక్షత్రాన్ని పురసరించుకొని మలయప్పస్వామికి పుష్పార్చన నిర్వహించనున్నారు.