హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నంద్యాల జిల్లా నందికొటూరులో ప్రేమించట్లేదనే కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం నిందితుడు కూడా నిప్పంటించుకోవటంతో గమనించిన స్థానికులు మంటలార్పి దేహశుద్ధి చేశారు. బాలికను లహరిగా గుర్తించారు.
ఆమె స్వస్థలం వెల్దుర్తి మండలం రామళ్లకోట కాగా, తండ్రి చనిపోవడంతో నందికొటూరులోని బైరెడ్డినగర్లో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నట్టు సమాచారం. నిందితుడిని కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్రగా గుర్తించారు.