Botsa Satyanarayana | విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక
Botsa Satyanarayana | విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అమరావతి : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC by-election)లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల అధికారులు అధికారికంగా బొత్స ఎన్నికను ప్రకటించారు. ఆయన మూడేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు , సహకరించిన వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం (Allaince Government) తప్పుకోవడంతో రంగంలో మొత్తం ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) , స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ (Nominations) నామినేషన్ వేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం అప్పటి మండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిని పలు దఫాలుగా పరిశీలించి చివరకు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి 600 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్ల సంఖ్యాబలం ఉంది. కూటమికి 200 పైగా మాత్రమే సభ్యులున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం చివరకు హుందాగా రాజకీయాలు చేద్దామని, ఎవరిని ప్రలోభ పెట్ట వద్దని సూచిస్తూ ఎన్నికల్లో్ పోటీ వద్దంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో కూటమి బరిలో నిలువ లేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

