అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లాలో ( Alluri District ) బొలెరో వాహనం ( Bolero Vehicle ) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరి జిల్లా జికె వీధి మండలం రింతాడ సమీపంలో రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న రైతులపై బొలెరో వాహనం దూసుకెళ్లింది.
ముందుగా ఆటోను ఢీకొట్టి కూరగాయల రైతులపై దూసుకెళ్లిన వాహనం దూసుకెళ్లడంతో 15 మందికి గాయాలు కాగా చింతపల్లిలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తులసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. బొలెరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.