అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా ( Prakasam District ) రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు వాహనాల ఢీ కొన్నాయి. నంద్యాల-అమరావతి జాతీయ రహదారిపై తుని నుంచి జీడిపప్పు లోడుతో అనంతపురం వెళ్తున్న బొలెరో వాహనం ముందువెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది
. దీంతో బొలెరో వాహనంలో మంటలు చెలరేగి వాహన డ్రైవర్ స్వామి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.