Big Tragedy : అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
Big Tragedy : వారిది అన్యోన్య దాంపత్యం. పెండ్లిలో ఆమె చేయందుకున్న ఆ వ్యక్తి.. మరణంలోనూ భార్య చేయిని భర్త వీడలేదు. భార్య మరణాన్ని తట్టుకోలేని ఆ భర్త…

విశాఖ : (Big Tragedy) వారిది అన్యోన్య దాంపత్యం. పెండ్లిలో ఆమె చేయందుకున్న ఆ వ్యక్తి.. మరణంలోనూ భార్య చేయిని భర్త వీడలేదు. భార్య మరణాన్ని తట్టుకోలేని ఆ భర్త… ఆమె మృతదేహంపై పడి ఏడుస్తూ తుదిశ్వాస విడిచి ఆమె వెంటే నడిచాడు. గంటల వ్యవధిలో ఇద్దరూ లోకాన్ని వీడటంతో రావికమతంలో తీరని విషాదం చోటుచేసుకున్నది.
విశాఖ జిల్లా చోడవరం మండలం రావికమతంకు చెందిన సింగంశెట్టి వెంకటరమణ, భవాని దంపతులు. 30 ఏండ్ల క్రితం వీరి పెండ్లైంది. భవాని (51) అరోగ్య సమస్యలతో మృతిచెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త వెంకటరమణ (56) గుండెపోటుకు గురై కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూశాడు. వీరికి సంతానం కలగకపోవడంతో భవాని అక్క మనుమడు వర్ధన్ (14)ను దత్తత తీసుకున్నారు. వెంకటరమణ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కిరాణాస్టోర్ నడుపుతున్నాడు. ఇటీవల భవాని డయాబెటిస్, బీపీతో అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో చోడవరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. విగతజీవిగా మారిన భార్యను చూసి వెంకటరమణ బోరున ఏడ్చాడు. ఆమె మృతదేహంపై పడి ఏడుస్తూ.. గుండెపోటుకు గురై అక్కడే పడిపోయాడు. భార్య మరణాన్ని తట్టుకోలే భర్త కూడా మరణించడంతో రావికమతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
తిరుమల ఘాట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

