డాటా చౌర్యానికి చంద్రబాబు కుట్ర నిజమే: భూమన
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించినట్లు ఆ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం డాటా చౌర్యానికి పాల్పడినట్లు అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించిందన్నారు.
వెలగపూడి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించినట్లు ఆ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 2016-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద కుట్ర జరిగిందని చెప్పారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో డాటా చౌర్యం, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణకు ఏర్పాటు చేసిన శాసనమండలి సబ్ కమిటీ సమావేశమైంది. చంద్రబాబు ప్రభుత్వం డాటా చౌర్యానికి పాల్పడినట్లు అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించిందన్నారు. హోం, ఐటీ శాఖల అధికారులతో నాలుగురోజుల పాటు చర్చించిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు.
రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని భూమన విమర్శించారు. ఇది ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా మారిందని అన్నారు. డాటా చౌర్యం చేసి దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించారని, అవి వైసీపీకి అనుకూల ఓట్లు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను మాత్రమే నిలుపుకుని.. వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు ప్రయత్నించాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ప్రజల వ్యక్తిగత డాటాను దొంగిలించి తప్పుడు మార్గంలో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. సేవా మిత్ర యాప్ ద్వారానే డాటా చోరీ జరిగిందని తెలిపారు.
ఈ డాటా చౌర్యంలో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో డాటా చౌర్యం పై వైసీపీ రచ్చ చేయడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే అప్పట్లో సిట్ నామమాత్రంగా పనిచేసిందని ఆయన తెలిపారు. పెగాసస్, డాటా చౌర్యంపై హౌస్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్‌కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మద్దాల గిరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

